మొదటి విడత రుణమాఫీ సంబరాలు

First installment of loan waiver celebrations– దౌల్తాబాద్ ఏవో గోవింద రాజు
నవతెలంగాణ – రాయపోల్ 
రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగిందని గజ్వేల్ ఏడిఏ, మండల ప్రత్యేక అధికారి బాబు నాయక్ అన్నారు. గురువారం రాయపోల్ రైతు వేదికలో రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ సీఎం రేవంత్ రెడ్డి చేశారని, రైతువేదికలో రుణమాఫీపై వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతులతో మాట్లాడి రైతుల కష్టసుఖాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. రాయపోల్ మండల పరిధిలో మొదటి విడతలో 2962 మంది రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ కావడం జరుగుతుందన్నారు. మొత్తం ప్రభుత్వం మూడు విడుదలలో రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు నెల చివరి వరకు మాఫీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం రైతు వేదిక వద్ద రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శులు, బ్యాంకు అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.