కృష్ణాష్టమి కానుకగా ఫస్ట్‌లుక్‌

కృష్ణాష్టమి కానుకగా ఫస్ట్‌లుక్‌విష్ణు మంచు నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ప్రతీ సోమవారం ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్‌ ఇస్తూ సినిమా పై మేకర్స్‌ అంచనాలు పెంచుతూ ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్‌ చేస్తూ బజ్‌ క్రియేట్‌ చేస్తున్నారు. శ్రీ కష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం స్పెషల్‌ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. కృష్ణాష్టమి సందర్భంగా మంచు విష్ణు తనయుడు అవ్రామ్‌ మంచు ఫస్ట్‌ లుక్‌ విడుదల కానుంది. ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న అవ్రామ్‌ ఈ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. మంచు వారి మూడు తరాలు ఇందులో కనిపించబోతున్నాయి. మోహన్‌ బాబు, విష్ణు మంచు, అవ్రామ్‌ మంచు కలయికతో ఈ చిత్రం స్పెషల్‌ కానుంది. అవ్రామ్‌ పాత్ర, సినిమాలో లుక్‌ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందేనని అంటున్నారు మేకర్స్‌. ఈ పాన్‌ ఇండియా చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.