”ఫస్ట్ లవ్’ సాంగ్ ఒక బ్యూటీఫుల్ సినిమా చూసిన ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. చివర్లో హార్ట్ బ్రేక్ అయ్యింది. తప్పకుండా ఈ సినిమా బిగ్ హిట్ అవుతుంది’ అని సంగీత దర్శకుడు తమన్ అన్నారు. దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్‌లో బాలరాజు ఎం డైరెక్ట్ చేసి బ్యూటీఫుల్ మ్యాజికల్ ఆల్బమ్ ‘ఫస్ట్ లవ్’. వైశాలిరాజ్ నిర్మించిన ఈ ఆల్బమ్ టీజర్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. తాజాగా సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్ ఫస్ట్ లవ్ సాంగ్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ఫస్ట్ లవ్ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటీఫుల్‌గా ఉంది. సాంగ్‌లో ఒక అద్భుతమైన కథ చూపించారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. మధు పొన్నాస్ బ్యూటీ ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశారు. సంజీవ్ థామస్, సిద్ శ్రీరామ్ ప్రాణం పెట్టి చేశారు’ అని అన్నారు. ‘తమన్ చాలా బిజీగా ఉండి కూడా మమ్మలి సపోర్ట్ చేయడానికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది’ అని హీరోయిన్, ప్రొడ్యూసర్ వైశాలిరాజ్ చెప్పారు.