ఆసియా క్రీడల్లో టీమ్ ఇండియా ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో పతకాల ఖాతా తెరిచింది. అథ్లెటిక్స్ పోటీలు శుక్రవారం నుంచే ఆరంభం కాగా.. తొలి రోజే భారత్‌కు పతకం దక్కింది. మహిళల షాట్‌పుట్‌లో కిరణ్ బలియన్ కాంస్య పతకం సాధించింది. ఫైనల్లో మూడో ప్రయత్నంలో ఇనుప గుండును 17.36 మీటర్ల దూరం విసిరిన కిరణ్ బలియన్.. పతకం సొంతం చేసుకుంది. పతక పోటీలో వరుసగా 15.42, 16.84, 17.36, 16.76, 16.79, 16.87 మీటర్లు దూరం విసిరింది. చైనా అథ్లెట్లు చెన్ గాంగ్, చెన్ సాంగ్‌లు వరుసగా 19.58 మీటర్లు, 18.92 మీటర్లతో పసిడి, రజత పతకాలు సాధించారు.