జిల్లాస్థాయి చెకుముకి పోటీల్లో ప్రథమ స్థానం 

First place in district level flint competitionsనవతెలంగాణ – నిజాంసాగర్

జనవిజ్ఞాన వేదిక కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని దేవుని పల్లి జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో కామరెడ్డి జిల్లా లోని అన్ని మండలాల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాల పోటీలలో నిజాంసాగర్  మండలంలోని మల్లూరు జడ్.పి.హెచ్.ఎస్ తెలుగు మీడియం విద్యార్థులు(వి.అంజన సౌమ్య పదవ తరగతి, డి.భావన 9వ తరగతి, బి. మీనాక్షి 8వ తరగతి) మొదటి స్థానం సాధించి ప్రతిభ చాటారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, నిజాంసాగర్ మండల విద్యాశాఖ అధికారి తిరుపతిరెడ్డి తెలిపారు. వారికి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు ప్రశంస పత్రాలు, బహుమతులు అందించి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. చెకుముకి సైన్స్ చాలాన్ టెస్టు అనేది విద్యార్థుల సైన్స్ పై అవగాహన, వారి ఆచరణాత్మక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని సవాల్ చేసే, విద్యార్థులలో మూఢనమ్మకాలకు ఎలాంటి తావు లేకుండా చేసే పోటీ అని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.