నవతెలంగాణ-భువనగిరి రూరల్ : రాష్ట్రీయ స్థరీయ బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శని సైన్స్ ఫెయిర్ లో సందర్భంగా రాష్ట్రస్థాయిలో జరిగిన సైన్స్ సెమినార్ లో జిల్లాలోని భువనగిరి మండలం నందు మదర్ తెరిస్సా ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రేయ సురేష్ విద్యార్థిని జిల్లా స్థాయిలో ప్రధమ స్థానంలో పొంది రాష్ట్రస్థాయి సెమినార్ లో పాల్గొన్నారు.టి ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి డైరెక్టర్ హైదరాబాద్ వారు ప్రకటించిన రాష్ట్రస్థాయి ఫలితాల్లో కూడా మొదటి బహుమతిని పొందినదని జిల్లా విద్యాశాఖ అధికారి డా కే నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గైడ్ టీచర్ రాజేశ్ & జార్జ్ సహకారంతో రాష్ట్రస్థాయిలో తృణధాన్యాలు- ఆరోగ్యం & సుస్థిర భూమి అనే అంశంలో సెమినార్ ను ఇచ్చి మొదటి బహుమతి పొందినారనీ, రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి పొందినందుకు ప్రిన్సిపల్ సురేష్ ను, గైడ్ టీచర్ లు రాజేష్ & జార్జ్ ను , విద్యార్థినిని జిల్లా విద్యాశాఖ అధికారి డా కే నారాయణరెడ్డి గారు, మండల విద్యాధికారి నాగ వర్ధన్ రెడ్డి , జిల్లా సైన్స్ అధికారి భరణి కుమార్ అభినందించారు.