
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలు దగ్గర పడటంతో స్థానిక వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రధమ సంవత్సరం విద్యార్థులు శనివారం వీడ్కోలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శేషుబాబు పర్యవేక్షణలో విద్యార్థులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తదనంతరం ఉపాద్యాయులు విద్యార్ధులను ఉద్దేశించి చేసిన పరీక్షల కోసం ఏవిధంగా సన్నద్ధం కావాలి, పరీక్ష సమయంలో ఎలా ప్రవర్తించాలి, అనే సూచనలు, భవిష్యత్తు లో జరిగే పోటీ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలి, జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి, అనే ప్రసంగాలు విద్యార్ధులను ఉత్తేజ పరిచాయి. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.