గజగౌని ప్రొడక్షన్ పతాకంపై కవిత రాజ్ పుత్, జమున, అంజలి, మధు, హీరో, హీరోయిన్లుగా మధులింగాల దర్శకత్వంలో గజగౌని దయానంద్ గౌడ్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్, ‘కావ్య రాజ్’. ఈ చిత్ర టైలర్ లాంచ్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథి విచ్చేసిన ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత దయానంద్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా మామూలు సినిమా కాదు. తెలంగాణ మొట్టమొదటి మూకీ చిత్రం. మాకు ఆదర్శనీయుడైన లెజెండరీ నటుడు పైడి జయరాజుకి ఈ సినిమాని అంకితం ఇస్తున్నాం. ఇది అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా అవుతుంది’ అని తెలిపారు. ‘పైడి జైరాజ్‌ని ఆదర్శంగా తీసుకుని దయానంద్ ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. చాలా కాలం తర్వాత మంచి మూకీ సినిమా రాబోతుంది. ఈ మంచి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని ప్రసన్న కుమార్ చెప్పారు.