మాంచెస్టర్: ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు కిలియన్ ఎంబాపే ప్రాతినిధ్యం వహించిన రియల్ మాడ్రిడ్ క్లబ్ తొలి టైటిల్ సాధించింది. బుధవారం జరిగిన యూఈఎఫ్‌ఏ సూపర్ కప్ ఫైనల్లో రియల్ మాడ్రిడ్ క్లబ్ 2-0గోల్స్ తేడాతో అట్లాంటాపై విజయం సాధించింది. దాంతో ఎంబాపే.. ‘అది నిజంగా గొప్ప రాత్రి. నాకైతే చాలా గొప్ప క్షణం. అన్నిటికంటే ముఖ్యమైనది మాడ్రిడ్ తరఫున మేము టైటిల్ గెలిచాం. నాకు చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్‌లో నేను గోల్ కొట్టడం ఇంకా తృప్తినిచ్చింది. నాలాంటి స్ట్రయికర్‌కు అది చాలా ప్రధానం. ఏది ఏమైనా ఈ జట్టుతో ఆడడం చాలా బాగుంది. జట్టుగా మరింత పరిణితి చెందడం ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే జట్టగానే కదా మేము గెలిచది’ అని ఎంబాబే తెలిపాడు. ప్రపంచ ఫుట్‌బాల్‌లో సంచలనంగా మారిన ఎంబాపే 2007లో మొనాకో క్లబ్ నుంచి పారిస్ సెయింట్ జర్మనీ చేరాడు. అప్పటి నుంచి ఏడేండ్లు ఆ క్లబ్‌కు ఆడాడు. పిఎస్‌జి తరఫున 306 మ్యాచ్‌లు ఆడిన ఎంబాపే 255గోల్స్ కొట్టడమే కాకుండా 108గోల్స్ చేయడంలో సహచరులకు సహాయం చేశాడు. కొత్త సీజన్‌కు ముందు పిసిజితో ఏడేళ్ల బంధానికి ఎంబాపే బై బై చెప్పేశాడు.