కెమికల్స్ నీరు తాగి చేపలు మృతి..

నవతెలంగాణ-బొమ్మలరామారం : మూడ్రోజులుగా కురుస్తున్న వానల కు కెమికల్ కంపెనీలకు వరంగా మారుతున్నాయి. కెమికల్ ఇండస్ట్రీస్ లోని ప్రమాదకరమైన వేస్ట్ కెమికల్స్ ను స్థానికంగా ఉండే చెరువులు, కుంటల్లోకి వదులుతున్నారు, దీంతో ఆ చెరువుల్లోని వేలాది చేపలు మృత్యువాత పడుతున్నాయి.

బొమ్మలరామారం మండలంలోని రామలింగపల్లి, రంగాపురం చెరువులో చుట్టూ పక్కల ఉన్న కెమికల్ కంపెనీల నుండి వేలువడే వ్యర్థ రసాయనాలను కుంటలు చెరువులులలోకి వదులుతున్నారు.పారిశ్రమలు వ్యర్థం రసాయన కలిసితం నీరు త్రాగి మృత్యువాత పడుతున్నాయని, వెంటనే మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలని  సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం డిమాండ్ చేశారు.వ్యర్థ రసాయన నీరు త్రాగడం వలన చేపలు మృతి చెందాయని గ్రామస్తులు, మత్స్య కార్మికులు బుధవారం తాసిల్దార్ కార్యాలయం ముందు మృతి చెందిన చేపలను పట్టుకొని  నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చెరువులను పరిశీలన చేయడం జరిగింది.ర్యకలశ్రీశైలం  మాట్లాడుతూ.. పొల్యూషన్ సమస్యపై అనేకసార్లు పీసీబీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చిన దున్నపోతు మీద వాన పడ్డట్లుగా ఉందని.వెంటనే పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం మీద చర్యలు తీసుకోకపోతే సిపిఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో పరిశ్రమల ముందు పీసీబీ కార్యాలయం ముందు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.వీరితోపాటు మండల కమిటీ సభ్యులు గూదే ఎల్లయ్య ,మైలారం లక్ష్మయ్య, ముక్కల పున్నమ్మ, భూక్య రమేష్ ,మేడమైన కిష్టయ్య ,గొల్లన్ కొండ బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.