మత్స్యపారిశ్రామిక సహకార సంఘం పత్రాలను అందజేత..

– జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్
నవతెలంగాణ- మల్హర్ రావు
మంథని మండలంలోని విలోచవరం గ్రామానికి చెందిన 35 మంది సభ్యులతో కూడిన మహిళ మత్స్యపారిశ్రామిక సంఘంను ఏర్పాటు చేసి చీఫ్ ప్రమోటర్ గా జునుగరి శ్రుతిని నియమించడం జరిగిందిని, వారికి పత్రాలు అందజేసినట్లుగా జిల్లా మత్స్యకారుల సంఘం డైరక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు మాట్లాడుతూ మంథని మండలంలోని ప్రతి గ్రామంలో మహిళలు ముందుకు వచ్చి మహిళ మత్స్యపారిశ్రామిక సహకార  సంఘాలు ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. విలోచవరం మహిళ సొసైటీ ఏర్పాటు కు సహకరించిన పెద్దపల్లి డిఏప్ఓ భాస్కర్ కృషి చేసిన విలోచవరం మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు జునుగరి బాపు, సర్పంచ్ బండ రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఉపాధ్యక్షులు నరెడ్ల బొంద్యాలు కార్యదర్శి జునుగరి రాజయ్య ఉపసర్పంచ్ తూడ్ల అంజన్న తో పాటు మహిళ మత్స్యశాఖ సంఘం సభ్యులు పాల్గొన్నారు.