మత్స్యకారుల జీవన చిత్రం

మత్స్యకారుల జీవన చిత్రంవంశీ రామ్‌ పెండ్యాల, అజరు, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రేవు’. ఈ చిత్రంలో గురు తేజ్‌, సుమేష్‌ మాధవన్‌, హేమంత్‌ ఉద్భవ్‌, లీలా వెంకటేష్‌ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై నిర్మాత డా. మురళీ గింజుపల్లి నిర్మిస్తున్నారు. నవీన్‌ పారుపల్లి సమర్పకులుగా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా ఫిలిం జర్నలిస్ట్‌ పర్వతనేని రాంబాబు, సినిమా ప్రొడక్షన్‌ పర్యవేక్షకులుగా ఫిలిం జర్నలిస్ట్‌ ప్రభు వ్యవహరిస్తున్నారు. హరినాథ్‌ పులి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్‌ ఫ్యాషన్‌ షో, స్పెషల్‌ పార్టీ నిర్వహించారు. ఈ షోలో చిత్ర బందంతో పాటు మురళీ మోహన్‌, ఆర్జీవీ, అనన్య నాగళ్ల, సంపత్‌ నంది, ఉత్తేజ్‌ అతిథులుగా పాల్గొని సందడి చేశారు.
నిర్మాత డాక్టర్‌ మురళి గింజుపల్లి మాట్లాడుతూ,’మత్స్యకారుల జీవన చిత్రానికి ఇదొక ప్రతిబింబం. ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం’ అని తెలిపారు. ‘యూఎస్‌ నుంచి వచ్చిన తర్వాత మురళికి ఈ సినిమా ఫస్ట్‌ కాపీ చూపించాం. ఆయన చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చాలా సహజంగా ఈ సినిమా సాగుతుంది. ఇందులోని ఎమోషన్‌ ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టులు నేచురల్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశారు’ అని నిర్మాణ సూపర్‌ విజన్‌ జర్నలిస్ట్‌ ప్రభు అన్నారు.