భారత వృద్థి 6.3 శాతంగా ఫిచ్‌ అంచనా

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత వృద్థి రేటు 6.3 శాతంగా ఉండొచ్చని రేటింగ్‌ ఎజెన్సీ ఫిచ్‌ అంచనా వేసింది. ఇంతక్రితం వేసిన 6 శాతం అంచనాను సవరించింది. 2023 మార్చితో ముగిసిన తొలి త్రైమాసికంలో మెరుగైన వృద్థి, స్వల్ఫకాలంలో వృద్థికి మెరుగైన అవకాశాలు ఉండటంతో జిడిపి అంచనాలను పెంచినట్లు పేర్కొంది. గడిచిన 2022-23లో 7.2 శాతం వృద్థి నమోదయిన విషయం తెలిసిందే. 2021-22లోనూ 9.1 శాతం పెరుగుదల చోటు చేసుకోగా.. ఆ రెండేళ్లతో పోల్చితే ఈ ఏడాది తగ్గనుంది.