ఒకే తరగతి గదిలో ఐదు క్లాసులు

నవతెలంగాణ – మల్హర్ రావు 
మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 30 మంది విద్యార్థులు, ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు.అయితే సోమవారం ముగ్గురు ఉపాద్యాయుల్లో ఒక్కరూ మాత్రం హాజరైయ్యారు. పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులు ఒకే తరగతిలో కూర్చొబెట్టి విధులకు హాజరైన ఉపాద్యాయుడు బొదిస్తున్నారు. మిగతా ఇద్దరు ఉపాధ్యాయులు ఒకరు లివ్ లో ఉండగా మరొక్కరూ ఎమ్మార్సీ కార్యాలయానికి పనిపై వెళ్లినట్లుగా హాజరైన ఉపాద్యాయుడు తెలిపారు. ఇలా అన్ని తరగతులకు సంబంధించిన విద్యార్థులు ఒకే తరగతి గదిలో పాఠాలు చదవడంపై విద్యార్థులకు బోధన ఎలా అర్ధమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.