నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మండలంలోని ఎడ్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో తెప్పల మధుసూదన్ అనే రైతుకు చెందిన ఐదు దేర్ధి అవులు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఆవుల యజమాని పూర్తి కథనం ప్రకారం గురువారం ఉదయం ఆవులను మేతకోసం విడిసిపెట్టినట్లుగా తెలిపారు. ఆవులు మేసుకుంటు ఉరుప్రక్కనున్న పొలాల్లోకి వెళ్లగా 11 కెవి విద్యుత్ తీగలు తెగిపడగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ ఐదు ఆవులు అక్కడికక్కడే మృతి చెందినట్లుగా కన్నీరుమున్నీరైయ్యారు.విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే తమకు రోజు ఆవుల పాలతో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఆదాయం రావడంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడినని ఆవుల మృరితో తన కుటుంబం రోడ్డున పడిందని, ఆర్థికంగా ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారులు అందుకోవాలని బాధిత కుటుంబం వేడుకొంటోoది. కాగా సంఘటన స్థలాన్ని ఎంపిపి సందర్షించారు.బాధితులు అధైర్య పడవద్దని,ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.కరెంట్ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.విద్యుత్ శాఖ అధికారులు బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.