ఐదురోజులుగా ప్రతిష్టాపణ ఉత్సవాలు

నవతెలంగాణ – కంటేశ్వర్ 
నిజామాబాదు నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో గురువారం  శ్రీ భక్త మార్కండేయ విగ్రహం,రాజగోపుర ప్రాణప్రతిష్టాపణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఐదురోజులుగా ప్రతిష్టాపణ ఉత్సవాలు జరుగుతుండగా చివరి రోజు గురువారం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకమలములచే మార్కండేయ ప్రాణప్రతిష్ట జరిపారు.ఈ సందర్భంగా తెల్లవారుజామునుంచే దృక్ బలి,దిగ్ బలిహరణము,నేత్రోన్మిలనము, మహాపూర్ణాహతి,కుంబ సంప్రోక్షణ,శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కల్యాణం కార్యక్రమాలు నిర్వహించారు. శతాదిప్రతిష్టాపనాచార్యులు చౌట్ పల్లి గంగాప్రసాద్ దీక్షితులు పౌరోహిత్యంలో జరిగిన
పార్వతీ రాజరాజేశ్వర స్వామి శాంతి కల్యాణంలో మంగిరాములు మహారాజ్,ఇప్పకాయల హరిదాస్ స్వామి, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డితో పాటు పెద్దయెత్తున భక్తులు పాల్గొని కల్యాణాన్ని వీక్షించారు..మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, మేయర్ దండు నీతూకిరణ్ తదితర ప్రముఖులు మార్కండేయ స్వామిని దర్శించుకొని పూజలు చేశారు.నగర పద్మశాలి సంఘం ఆద్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన భక్తులకు  అన్నప్రసాద వితరణ చేశారు.  నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జేటి వెంకటనర్సయ్య , జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు,మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర పద్మశాలి సంఘం బాధ్యులు గంట్యాల వెంకట్ నర్సయ్య,దాసరి గుండయ్య,కైరంకొండ విఠల్,బింగి మోహన్,మందిర కమిటీ చైర్మెన్ లక్కవత్రి దేవదాస్,రాపెల్లి గురుచరణ్,ఏజి రామస్వామి,గుడ్ల భూమేశ్వర్,బల్ల లక్ష్మిబాయి,కొండ గంగాచరణ్, చింతల గంగాదాస్,భీమర్తి సురేందర్,పెంటి రాజు బూస శ్రీనివాస్,,జె.సత్యపాల్,తుమ్మ నాగభూషణం,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.