డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురికి జైలు శిక్ష 

– ఆరుగురికి జరిమానా 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఐదుగురికి జైలు శిక్ష పడిందని ఆరుగురికి జరిమానా విధించామని నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. సిఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 11 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ తేదీ 24 శుక్రవారం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ముందు హాజరుపరచగా 6 గురికి 9500 /- జరిమానా విధించి, ద్వారకా నగర్ కు చెందిన ఏ.జయరాజ్ కు మూడు రోజుల జైలు శిక్ష,  కోటగల్లికి చెందిన యాదగిరి, ముదక్ పల్లికి కి చెందిన సిహెచ్ నరేష్,.  మధ్య ప్రదేశ్ కు చెందిన జితేందర్, అను వ్యక్తులకు రెండు రోజుల జైలు శిక్ష, బిచ్కుంద కు చెందిన జి. బాలరాజు ఒకరోజు జైలు శిక్ష విధించారని ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు.