సైబర్ మోసాలకు పాల్పడ్డ ఐదుగురు అంతర్ రాష్ట్ర నిందుతులు అరెస్ట్

Five inter-state suspects arrested for cyber fraud– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 10 కి పైగా ఫిర్యాదులు
– నిందుతుల వద్ద ల్యాప్ టాప్, 05 మొబైల్స్, బ్యాంక్ అకౌంట్స్ సీజ్
నవతెలంగాణ – సిరిసిల్ల
సైబర్ మోసాలకు పాల్పడ్డ ఐదుగురు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఎర్ర బద్ది గోపి అదే జిల్లాకు చెందిన కురుబ అశోక్ కుమార్ మాదిగ బ్రహ్మేంద్ర పుట్టపర్తి జిల్లాకు చెందిన మాదిగ స్వాతి కురుబ వరలక్ష్మి లను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎర్రబద్ది గోపి ట్రాన్స్ ఇండియా కార్పొరేషన్ నెట్వర్క్ అనే కంపెనీ పేరుతో అనంతపూర్ జిల్లాలో లోకల్ యాప్ లో హెల్త్ కేర్  హోమ్ కేర్ ఫ్యాషన్ వేర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అను వాటి ఉత్పత్తి కంపనీల నుండి కస్టమర్లకు డైరెక్ట్ సెల్లింగ్ చేస్తామని, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని పత్రికల్లో ప్రకటన ఇచ్చారు.  ఇదే కంపెనీ లో పని చేస్తున్న అశోక్, వరలక్ష్మి,బ్రహ్మేంద్ర,స్వాతి లు కలసి ప్రకటనలు చూసి ఉద్యోగం గురించి అడిగే వారికి ఉద్యోగాలు  కల్పిస్తామంటూ నమ్మకం కలిగించేలా మాట్లాడి ఆశ కల్పిస్తూ వారి వద్ద నుండి రూ.10,000/-  రూపాయల వరకు డబ్బులను తీసుకొని వారికి కంపనీ యొక్క ఐడి ని ఇచ్చారు వారిని మరి కొంత మందిని కంపనిలో చేర్పించాలని తద్వారా కమిషన్ వస్తుందని లేదా వారు చెల్లించిన డబ్బులకు కేవలము రూ.1000/- రూపాయల విలువ గల వస్తువులను మాత్రమే వారికి ఇచ్చేవారిమని, ఇలా నిరుద్యోగులను ముల్టీ లెవల్ మార్కెటింగ్ విదానములో కంపనిలో చేర్చుకుంటూ ఆఫీసు యొక్క యజమాని గోపి కంపనీ నుండి పెద్ద మోతములో కమిషన్ పొందేవారు.
ఈ విధంగా వారి ప్రకటనలను చూసిన సిరిసిల్ల పట్టణనికి చెందిన దూస రమ్య అను మహిళ జాబ్ కావాలని మెసేజ్ చేసింది రమ్య తో జాబ్ ఇస్తానంటూ నమ్మబలికి  మొదటగా జాబ్ వెరిఫికేషన్కు రూ.400లు అడుగగా రమ్య ఫోన్ పే ద్వారా పంపాగా, ఆమెతో  ఫోన్ లలో మాట్లాడి జాబ్ వచ్చిందని నమ్మించగా ఐడి కొరకు రూ.5000 రూపాయలు రమ్యని అడుగగా రూ.5000 రూపాయలు పంపినది. తర్వాత ఆమెకు మార్కెటింగ్ లో తమ కంపెని కి సంబంధించిన వస్తువులు అమ్మలని చెప్పారు. ఎప్పుడు మార్కెటింగ్ అని చెపుతున్నారు అని అడుగగా మరో రూ.5000 పంపిస్తే జాబ్ ఇస్తాం అని చెప్పగా రమ్య మరల రూ.5000 పంపిన తరువాత వారు రెస్పాండ్ కాకపోవడంతో వారు మోసం చేసారని గ్రహించింది. సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా.. సిరిసిల్ల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి  సిరిసిల్ల పట్టణ, సైబర్ సెల్ పోలీసులు ఈ ఐదుగురు నిందుతులను శుక్రవారం అనంతపురం జిల్లాలో నీ శారదా నగర్ లో అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక ల్యాప్ టాప్, 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల్లో త్రాంజ్ ఇండియా కార్పొరేషన్ నెట్వర్క్ పై ఎన్ సి ఆర్ పి పోర్టల్ నందు 10 కి పైగా ఫిర్యాదులు ఉన్నాయని, ఇ ఫిర్యాదులపై కూడా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం జరుగుతుందని, ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే 1930 కాల్ చేసి పిర్యాదు చేయాలని ,సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ  తెలిపారు.