
చిల్పకుంట్ల మిషన్ భగీరథ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలను గత ఐదు నెలల నుండి చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంటా నాగయ్య, తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మొగుళ్ళ గోపాల్ లు అన్నారు.సోమవారం మిషన్ భగీరథ కార్మికులతో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామంలోని మిషన్ భగీరథ ప్లాంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ గత 7 ఏళ్ల నుండి ఈ రంగంలో పని చేస్తున్నారు. కనీస వేతనాలు అతి తక్కువగా చెల్లిస్తున్నారు. ఇవి కూడా నెల నెల ఇవ్వకుండా ఐదు నెలలు లేదా ఆరు నెలల వరకు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందన్నారు. అనేక దఫాలు వేతనాలు సకాలంలో ఇవ్వాలని కాంట్రాక్టర్ కు మొరపెట్టుకున్న, అధికారులకు విన్నవించుకున్న ఎవరు పట్టించుకోవడం లేదు. దీనితో అనేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.గత పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కాంట్రాక్టర్లను అడుగుతుంటే ఇష్టముంటే పనిచేయండి. లేకపోతే ఉద్యోగం వదులుకొని వెళ్లిపోండని బెదిరింపులకు గురిచేస్తున్నారని అన్నారు.
ఈ బెదిరింపులు నిరంతరాయంగా కొనసాగుతున్నవని ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించలని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వడం లేదు. కనీసం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ జీవోలో ప్రకారమైన వేతనాలు చెల్లించడం లేదు. ఏ ప్రాతిపాదికన వేతనాలు చెల్లిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గత పిఆర్సి లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ కు వేతనాలు పెంచారు. కానీ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కాంటాక్ట్ వర్కర్స్ కు మాత్రం వేతనాలు పెంచలేదు.వీరిపైన వివక్షత పూరితంగా ప్రభుత్వం తో పాటు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కావున మా సమస్యల పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు ఆ యూనియన్ ఉపాధ్యక్షులు కూసు ఉప్పలయ్య, కటకం సైదులు, గంట రామకృష్ణ, డి.మహేష్,గంట సైదులు,ప్రవీణ్,ఉపేందర్,బత్తుల గురువయ్య ,రచ్చ రాము తదితరులు పాల్గొన్నారు.