
నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ధీరావత్ గోపి నాయక్ తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కె.జండగేకు అందజేశారు.
కదిరి కిరణ్ నామినేషన్ దాఖలు
భువనగిరి పార్లమెంట్ స్థానానికి బహుజన్ రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా కదిరె కిరణ్ కుమార్ తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జండగే కు అందజేశారు.
ఉదయ్ మల్లేష్ నామినేషన్ దాఖలు
భువనగిరి పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఊదరి మల్లేష్ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి హనుమంతు కె.జండగే కు అందజేశారు.
పెంట రమేష్ నామినేషన్ దాఖలు
పెంట రమేష్ నామినేషన్ దాఖలు
భువనగిరి పార్లమెంట్ స్థానానికి బహుజన్ ముక్తి పార్టీ అభ్యర్థిగా పెంట రమేష్ తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జెండగేకు అందజేశారు.
ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి కొంగరి స్వామి నామినేషన్ దాఖలు
భువనగిరి పార్లమెంట్ స్థానానికి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా కొంగరి లింగ స్వామి తన నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే.జెండగే కు అందజేశారు. నామినేషన్ల పర్వంలో స్వతంత్ర అభ్యర్థుల జోరు భువనగిరి పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థుల పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గుర్తింపు లేని పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రధాన పార్టీలే కొందరిని నామినేషన్ వేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. వారి పేరు మీద వాహనాలు. ఇతర ఏజెంట్ సౌకర్యాలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. స్వతంత్ర అభ్యర్థులు రెండు మూడు సెట్లు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.