కాంగ్రెస్‌ ఐదు హామీలు అమలు కావట్లేదు

– కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఐదు హామీలు అమలు కావడం లేదని ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే చంద్రప్ప అన్నారు. మంగళవారం హోటల్‌ కత్రియాలో ఆయన మీడియాతో మాట్లాడారు. అక్కడ ఐదు కేజీల బియ్యం పంపిణీ అట్టర్‌ ప్లాపైందన్నారు. విద్యానిధి కింద ఇస్తామన్న రూ.3 వేలు, ప్రతి మహిళకూ రూ.2 వేలు ఇవ్వట్లేదని చెప్పారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కా రుంటేనే అన్నీ సాధ్యమవుతాయన్నారు. తెలంగాణలో నేడు ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని విమర్శించా రు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ది మూడో స్థానమేనని తేల్చిచెప్పారు. వచ్చే పార్ల మెంట్‌ ఎన్నికల్లో జేడీఎస్‌, బీజేపీ 25 ఎంపీ స్థానాలు గెలుస్తాయన్నారు. మరో ఆరు నెలల్లో కర్నాటకలో కాంగ్రెస్‌ గవర్నమెంట్‌ ఉంటుందో ఉండదో కూడా తెలియదనీ, ఆ పార్టీలో ఐదు గ్రూపులున్నాయని విమర్శించారు.