మోడల్ పాఠశాల నుండి ట్రిబుల్ ఐటీకి ఐదుగురు ఎంపిక


నవతెలంగాణ-గోవిందరావుపేట మండలంలోని చల్వాయి మోడల్ పాఠశాల నుండి ఐదుగురు అమ్మాయిలు బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నిజాముద్దీన్ తెలిపారు. మోడల్ పాఠశాలలో గురువారం ప్రిన్సిపాల్ నిజాముద్దీన్ మాట్లాడుతూ పాఠశాలలో చదివిన ఐదుగురు విద్యార్థినులు సూదిని హస్సిత 10/10, గండ్రకోట అను 10/10, దూడల సాహితి 9.8/10, మందాడి అక్షిత 9.8/10, కొయ్యల భార్గవి 9.8/10 లు బాసర ట్రిపుల్ ఐటి ఐఐఐటీకి ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు వర్షం వ్యక్తం చేశారు. పాఠశాల నుండి విద్యార్థులు అత్యద్భుతమైన ప్రతిభను కనబరుస్తూ పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తున్నారని అన్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు కూడా ఎంతో కష్టపడి ఇలాంటి ఫలితాలని సాధించాలని అందుకు తగ్గట్టుగా తర్ఫీదు ఇస్తున్నామని అన్నారు.