– సీఎంకు డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లచ్చిరెడ్డివినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి ప్రభత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం పలు రెవెన్యూ సంఘాల నాయకులతో కలిసి సచివాలయంలో వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విన్నవించారు. ఉద్యోగాల క్రమబద్ధీకరణ సమయంలో వయసు పైబడిన, మతి చెందిన వారి స్థానాల్లో వారసులకు అవకాశం కల్పించడంతో పాటు వీఆర్‌ఏలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం తగు చర్యలు చేపట్టాల్సిందిగా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎంకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కె.రామకష్ణ, ఎస్.రాములు, రమేష్, ఫూల్‌సింగ్ చౌహాన్, వీఆర్‌ఏ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.