– నైట్‌ఫ్రాంక్ ఇండియా
హైదరాబాద్ : ప్రస్తుత ఏడాది జనవరిలో హైదరాబాద్‌లో నివాస రిజిస్ట్రేషన్లు స్థిరంగా నమోదయ్యాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఓ రిపోర్ట్‌లో తెలిపింది. గడిచిన నెలలో నగరంలో 5,411 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు నమోదయ్యాయని పేర్కొంది. వీటి విలువ రూ.3,279 కోట్లుగా ఉందని తెలిపింది. గతేడాదితో పోల్చితే విలువలో మాత్రం 24 శాతం పెరుగుదల చోటు చేసుకున్నట్టు పేర్కొంది. 2024 జనవరిలో నమోదయిన గృహాలలో 71 శాతం కూడా 1,000 – 2,000 చదరపు అడుగుల పరిమాణంలోనివని పేర్కొంది. రూ.1 కోటి, అంతకంటే ఎక్కువ ధర కలిగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో భారీ పెరుగుదల చోటు చేసుకుందని వెల్లడించింది. 2023లో అధిక ధర కలిగిన నివాసాల వాటా 8 శాతంగా ఉండగా.. 2024 జనవరిలో ఈ వాటా 14 శాతానికి చేరినట్లు తెలిపింది.