కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్

నవతెలంగాణ- యాదగిరిగుట్ట రూరల్
కేంద్ర బలగాలు, రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలో బుధవారం నిర్వహించారు. యాదాద్రి జోన్ అడిషనల్ డిసిపి రవికుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది చాలా కీలకమైన విషయం అన్నారు. ఈ ఎన్నికల ప్రక్రియలో విచ్చలవిడిగా ప్రచారం చేయడానికి వీలు ఉండదు, రిటర్నింగ్ ఆఫీసర్ పర్మిషన్ మేరకు మాత్రమే ప్రచారం నిర్వహించవలసి ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట  ఏసీపి శివరాం రెడ్డి, సిఐ రమేష్, ఎస్ఐ, సిఐఎస్ఎఫ్ ఫోర్స్, ఆర్మూడ్ రిజర్వ్ ఫోర్స్, యాదగిరిగుట్ట పోలీసులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.