నవతెలంగాణ-బెజ్జంకి: ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేల కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసామని..శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ ప్రజలకు నమ్మకం కల్పించడమే ఫ్లాగ్ మార్చ్ ప్రధాన లక్ష్యమని ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బుధవారం కేంద్ర బలగాలతో మండల కేంద్రంతో పాటు గుండారం గ్రామంలో ప్రధాన రోడ్లపై కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ ఎస్ఐ నిర్వహించారు.సిద్దిపేట రూరల్ ఎస్ఐ అపూర్వ రెడ్డి, ససస్త్ర సీమబల్ బలగాలు, పోలీసులు పాల్గొన్నారు.