పజల్లో ఎన్నికల పట్ల అత్మవిశ్వాసం కలిగేలా ఫ్లాగ్‌ మార్చ్‌

పజల్లో ఎన్నికల పట్ల అత్మవిశ్వాసం కలిగేలా ఫ్లాగ్‌ మార్చ్‌నవతెలంగాణ-టేకులపల్లి
పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా మండలంలోని బోడులో ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ సోమవారం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునెలా వారిలో నమ్మకం, భరోసా, భద్రత కలిగేలా పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ కవాతు నిర్వహించడం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఫ్లాగ్‌ మార్చ్‌ కవాతును బోడులో నిర్వహించారు. సమస్యత్మక గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించినట్లు చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికలలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు జిల్లా పోలీసు సిబ్బందితో కలిసి విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. బందోబస్తు మాత్రమే కాకుండా డబ్బు, మద్యం, ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్‌ పోస్టుల్లో పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.