
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ యంత్రాల పస్ట్ లెవెల్ ఎఫ్.ఎల్.సీ.ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్ ఆవరణల ఈ వి ఎం గోదాం లో నిర్వహిస్తున్న ఎఫ్.ఎల్.సి ని ఆదనవు కలెక్టర్లు సి.హెచ్. ప్రియాంక, ఏ. వెంకట్ రెడ్డి తో కలసి పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 13 మంది ఈ. సి.ఎల్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో ఈ నెల14వరకు ఓటింగ్ యంత్రాలైన 1867 వివిఫ్యాట్స్ ,2811 బ్యాలెట్ యూనిట్లు,1747 కంట్రోల్ యూనిట్లు ఎఫ్.ఎల్.సి.చేపడుతున్నామన్ని అన్నారు.ఈ నిర్వహణ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనాలని అలాగే రెవెన్యూ శాఖ నుండి 150 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ లు సూర్యాపేట కృష్ణయ్య, కోదాడ సూర్యనారాయణ, హుజర్నగర్ జగదీశ్వర్ రెడ్డి , ఆయా నియోజక వర్గాల తహశీల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.జే.పి పార్టీ నుండి అబిడ్, బి.ఆర్.ఎస్. నుండి సత్యనారాయణ, సి.పి.ఎం.నుండి కోటా గోపి, వై.ఎస్.ఆర్. సి.పి నుండి డి. రమేష్ ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.