
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి 9వ వార్డు యందు మంగళవారం ప్రజాపాలన, వార్డు సభ కార్యక్రమంలో ఫ్లెక్సీ రగడ కొద్దిసేపు ఉద్రిక్తతకు దారితీసింది. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే పైడి రెడ్డి ఫోటో ఫ్లెక్సీలో లేకపోవడంతో స్థానిక బిజెపి నాయకులు చిన్నారెడ్డి సంబంధిత అధికారులను అడిగారు. మాట మాట పెరిగి కొద్దిసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. గతంలో ఎక్సైజ్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి పర్యటనలో సైతం ఫ్లెక్సీ వార్ ఉద్రిక్తతకు దారితీసింది.