నవతెలంగాణ – దామరచర్ల జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న చెకుముకి సంబరాలు 2024 పోస్టర్ ను దామరచర్ల మండల విద్యాధికారి బాలాజీ నాయక్ బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సెకండరీ స్థాయి విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుటకు చెకుముకి టాలెంట్ టెస్టులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. నవంబర్ 7న పాఠశాల స్థాయిలో 8 ,9,10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్టులు నిర్వహిస్తానన్నామని, అందులో ప్రతిభ కనబరిచిన వారికి మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలలో పరీక్షలు నిర్వహించి ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బండ వెంకటరెడ్డి, కోలా శ్రీనివాస్, డి వెంకటేశ్వర్లు, పులగం రాధిక తదితరులు పాల్గొన్నారు.