విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే చెకుముకి

నవతెలంగాణ – నెల్లికుదురు
జనవిజ్ఞాన వేదిక నెల్లికుదురు మండల శాఖ మరియు జాతీయ సేవా పథకం సంయుక్త ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహణ మండల కన్వీనర్ దేశెట్టి యాకన్న, ప్రోగ్రాం ఆఫీసర్ మర్సగట్ల అనిల్ కుమార్ లు  జూనియర్ కళాశాల నెల్లికుదురులో శనివారం  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ ఆరిగాకుటి శ్రీనివాసరెడ్డి పాల్గొనీ వారు మాట్లాడుతూ విద్యార్థులు నేటి పోటీ ప్రపంచంలో సృజనాత్మకతతోపాటు, పట్టుదలతో కృషి చేస్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలో పోటీ పరీక్షల్లో పాల్గొంటే భవిష్యత్‌లో పోటీ పరీలపై భయం ఉండదని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను, పోటీతత్వాన్ని వెలికి తీయటానికి చెకుముకి టాలెంట్ పరీక్ష ఉపయోగపడుతుందని, ప్రతిభను కనబర్చిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేసినట్లు తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు తర్వాత జరిగే జిల్లాస్థాయి పోటీలకు ఎంపికచేస్తారని తెలిపారు. ఈ పోటీలో ఇంగ్లీష్ మీడియం విభాగంలో  జడ్ పి పి ఎస్ ఎస్  మేచరాజపల్లి, తెలుగు మీడియం విభాగంలో జడ్ఆ పి పి ఎస్ ఎస్  ప్రథమ స్థానం పొంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు, ద్వితీయ బహుమతిని టి ఎస్ ఎం ఎస్ నెల్లికుదురు గెలుపొందారు. ఈకార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక మండల బాధ్యులు కందికొండ బాబు, వెంకటేశ్వర్లు, కూన సతీష్, మహేందర్,నాగేశ్వరరావు అధ్యాపకులు ప్రకాష్ బాబు, రఘురాం, శ్రీనివాస్, సుధాకర్, సుభాష్, స్పందన, ప్రదీప్, గౌరీ శంకర్, లక్ష్మణ్ ,మంగమ్మ, సైదా మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.