ఈటీఓ మోటార్స్‌తో ఫ్లిక్స్‌బస్‌ ఒప్పందం

FlixBus ties up with ETO Motors– విజయవాడకు తొలి ఇవి బస్‌
నవ తెలంగాణ – హైదరాబాద్‌
ట్రావెల్‌ టెక్‌ లీడర్‌ అయినా ఫ్లిక్స్‌బస్‌ ఇండియా తాజాగా ఈటీఓ మోటార్స్‌తో భాగస్వామ్యం కుదర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తమ మొదటి ఎలక్ట్రిక్‌ బస్సును ప్రారంభిస్తున్నట్టు తెలిపింది.ఈవీ బస్సు కార్యకలాపాలను గురువారం హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జర్మన్‌ రాయబార కార్యాలయంలోని ప్రతినిధి అలెగ్జాండర్‌ రెక్‌, థండర్‌ ప్లస్‌ సీఈఓ రాజీవ్‌ వైఎస్‌ఆర్‌, ఫ్లిక్స్‌బస్‌ ఇండియా ఎండీ సూర్య ఖురానా హాజరయ్యారు. ఈ సేవలు ప్రజల సుదూర పర్యావరణ అనుకూల ప్రయాణ అవసరాలను తీర్చుతాయని మంత్రి ప్రశంసించారు.