ప్రాజెక్ట్ నగర్ గ్రామం లో గ్రామస్తులతో వరదల పట్ల అవగాహన ర్యాలి

Flood awareness rally with villagers in Project Nagar villageనవతెలంగాణ-గోవిందరావుపేట:
మండలంలోని ప్రాజెక్టు నగర్ గ్రామంలో వరదల పట్ల అవగాహన కల్పిస్తూ గ్రామస్తులతో పసర ఎస్సై ఏ కమలాకర్ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ రానున్న వర్షకాలం ను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ముందు గతం లో వరద ముంపుకు గురి అయిన ప్రాజెక్ట్ నగర్ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. గత అనుభవాల దృశ్య గ్రామం లో వరద తాకిడి పెరుగుతే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో గ్రామస్తులకు సూచనలు చేయటం జరిగింది. ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, వరద ముంపు కు గురి కావటానికి అవకాశం ఉన్న ప్రాంతాల వారు వర్ష తీవ్రత బట్టి వరద తాకిడిని అంచనా వేస్తూ ముంపు ప్రాంతాన్ని కాలి చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ల వలిసి ఉంటుందని చెప్పటం జరిగింది.కార్యక్రమం లో భాగంగా గ్రామస్తులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు