నవతెలంగాణ-బెజ్జంకి
స్వంత స్థలాలుండి ఆర్హులైన వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రూ.3 లక్షల గృహలక్ష్మి పథకానికి గురువారం చివరి రోజుగా ప్రభుత్వం నిర్ణయించడంతో బుధవారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయానికి దరఖాస్తులదారులు భారీగా తరలివచ్చారు. దరఖాస్తులదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యలయ సిబ్బంది సుమారు 340 దరఖాస్తులను పరిశీలించి స్వీకరించినట్టు ఎంపీడీఓ దమ్మని రాము తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఈ దఫా గురువారం చివరి గడువు రోజుగా ప్రకటించిన..నిరంతరం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియగా అవకాశముందని.. ప్రజలు అయోమయానికి గురికావద్దని ఎంపీడీఓ రాము తెలిపారు.