
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షానికి లేండి వాగుకు వరద ఉధృతి పెరిగింది మద్నూర్ మండల కేంద్రానికి లేండి వాగు అవతలి ఒడ్డున గల గోజేగావ్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ గ్రామానికి మండల కేంద్రానికి మధ్యన గల లేండి వాగు పైన ఓవర్ బ్రిడ్జి లేకపోవడం లో లెవల్ బ్రిడ్జి ఉన్నందున వరద ఉధృతి వస్తే రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. లేండి వాగు ఎగువనగల మహారాష్ట్ర నుండి పారుతుంది. గత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షానికి లేండి వాగుకు ఎగువ నుండి వరద నీరు భారీగా వస్తుంది. వరద నీటి ఉధృతి పెరగడం మండలంలోని గోజేగావ్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.