గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని మదన్ పల్లి గ్రామంలో పశు వైద్య, పశు సంవర్డక శాఖ  ఆధ్వర్యంలో గ్రామంలో జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్య క్రమం శుక్రవారం నిర్వహించబడినది. ఈ కార్యక్రమం మండల పశు వైద్యాధికారులు కిరణ్ ధేశ్ పాండే, ఉమాను సహేర్  పాడిరైతుల వద్దకు వెళ్ళి మూడు నెలలు పైబడిన పశువుల అన్నింటికీ టీకాలు వేయించాలి సూచించారు. గాలి కుంటు వ్యాధి బారిన పడకుండా ఉగుత్తలు పాటించాలని రైతులకు సూచనలు చేశారు. 585 పశువులకు టీకాలు వేశమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి గివురి ఒడ్డెన్న, గ్రామ ప్రత్యేక అధికారి పద్మ,  పశు వైద్య సిబ్బంది విఎల్ఓ టి. వినిత, ఎండీ. అహ్మద్ పాషా, గోపాల మిత సభీర్, ఆఫీస్ సబడ్నెంటులు మహేశ్వరి, శ్రీనివాస్, గంగాధర్, లక్ష్మి పుష్ప పాల్గొన్నారు.