మార్కెట్లలో ఒడిదుడుకులు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో గురువారం ఒడిదొడుకులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పవనాలతో తొలుత సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఉదయం సెన్సెక్స్‌ 71,907.75 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై.. ఓ దశలో 71,543 కనిష్ట స్థాయి వద్ద ట్రేడింగ్‌ అయ్యింది. మరో దశలో 71,999.47 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. తుదకు 63.47 పాయింట్లు లాభంతో 71,721 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.50 పాయింట్లు పెరిగి 21,647కు చేరింది. 2,022 స్టాక్స్‌ రాణించగా.. 1,251 షేర్లు ప్రతికూలతను ఎదుర్కొనగా.. మరో 63 స్టాక్స్‌ యథాతథంగా నమోద య్యాయి. నిఫ్టీలో హీరో మోటోకార్ప్‌, బజాజ్‌ ఆటో, రిలయన్స్‌ ఇండిస్టీస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌ షేర్లు అధికంగా లాభపడిన వాటిలో టాప్‌లో ఉండగా.. ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటరీస్‌, ఎస్‌బిఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌యుఎల్‌, విప్రో షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో హెచ్‌యూఎల్‌, విప్రో అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు 0.7 శాతం చొప్పున పెరిగాయి.