ఎగురబావుటా!

ఎగురబావుటా!ఓ మిత్రమా!

లేరెవ్వరు
ఈ జగత్తులో
పోటీ లేని కాలాన్ని
భయం లేని జీవనాన్ని
చవిచూడని వారు

కష్టించే తత్వంతో
ప్రయత్నం అనే మంత్రంతో
విద్యా విజ్ఞాన ప్రబుద్ధులతో
అంచెలంచెలుగా
ఎదుగుతూ

దఢ సంకల్పంతో
స్థిర చైతన్యంతో
ఉదాసీనతను
ప్రారదోలుతు
అవిరామంగా
నిబద్ధతతో పరిశ్రమిస్తూ
అంతా మనమంచికే
అనే స్వీయ వ్యక్తిత్వంతో

జయకేతనాన్ని
ఎగురబావుటా వేసిన
ఎందరో ఆజానుబాహులు
ఎల్లవేళలా అందరికీ
స్ఫూర్తిదాయకులు
వీరి జయకేతన పయనం
మరో జయానికి శ్రీకారం
– డా మైలవరం చంద్రశేఖర్‌