గుకేశ్‌పైనే ఫోకస్‌

గుకేశ్‌పైనే ఫోకస్‌– నేటి నుంచి గ్రాండ్‌ చెస్‌ టూర్‌
వార్సా (పోలాండ్‌) : క్యాండిడేట్స్‌ కింగ్‌గా నిలిచిన తర్వాత డి. గుకేశ్‌ తొలి పరీక్షకు సిద్ధమవుతున్నాడు. ఐదు అంచెల్లో సాగే గ్రాండ్‌ చెస్‌ టూర్‌ నేటి నుంచి పొలాండ్‌లో షురూ కానుంది. ప్రపంచ మేటీ తొమ్మిది మంది గ్రాండ్‌మాస్టర్లు ఇందులో పోటీపడుతున్నారు. గుకేశ్‌తో పాటు ఆర్‌. ప్రజ్ఞానంద సైతం ఎత్తులు వేయనున్నాడు. రోమానియా, క్రోయేషియా, యుఎస్‌ఏలో చివరి నాలుగు అంచెల పోటీలు ఉంటాయి. ఐదు అంచెల పోటీల అనంతరం విజేతను ప్రకటిస్తారు. ఫాబియానో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్నాడు. పొలాండ్‌లో అర్జున్‌, క్రోయేషియాలో విదిత్‌ గుజరాతీలు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వనున్నారు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌ ఓవరాల్‌ ప్రైజ్‌మనీ సుమారు రూ.15 కోట్లు.