స్వయం ఉపాధి పై దృష్టి సారించాలి

నవతెలంగాణ – పెద్దవంగర

స్వయం ఉపాధి పై యువత దృష్టి సారించాలని పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో శ్రీ రాజేశ్వర మెడికల్ జనరల్ స్టోర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..చదువుకున్న నిరుద్యోగులు ఖాళీగా ఉండకుండా, స్వయం ఉపాధిని ఎంచుకోవాలని సూచించారు. తల్లిదండ్రులకు భారంగా మారకుండా బాధ్యతగా మేదులుకొని, ఆర్థికంగా స్వంతంగా ఎదగడానికి వివిధ వ్యాపారాలు నెలకొల్పుకుని విజయం సాధించాలని వివరించారు. కార్యక్రమంలో చిలుక సంజీవరావు, గద్దల ఉప్పలయ్య, ఈదురు శ్రీనివాస్, సుంకరి ప్రశాంత్, ధర్మారపు వెంకన్న, గద్దల వెంకన్న, చిలుక సతీష్, శంబయ్య, ప్రొప్రైటర్ పులుగుజ్జ రామచంద్రు తదితరులు పాల్గొన్నారు.