ఎస్పీ మేడం… ట్రిపుల్ ఐటీ పై దృష్టిసారించండి.

నవతెలంగాణ-ముధోల్ : బాసర ట్రిపుల్ ఐటీ లో నిరంతరం భద్రత వైఫల్యాలతో ఏదో ఓక్క ఘటనలు చోటు చేసుకోవడంతో పోలీసులునివారించాల్సిన అవసరం ఏర్పడిందని పలువురు విద్యవంతులు, విద్యార్థి సంఘాలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి ట్రిపుల్ ఐటీ నుండి భద్రత వైఫల్యంతో ఇద్దరు విద్యార్థులు గోడదుకి పారిపోయిన సంఘటన తెలిసిందే. గతంలో కూడా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన  పలువురు విద్యార్థులు పట్టుబడిన విషయం కూడా తెలియంది ఏము కాదు. ట్రిపుల్ ఐటీ భద్రత పై  నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ప్రత్యేకంగా దృష్టి సారించి , చర్యలు తీసుకోవాలని పలువురు అంటున్నారు. గతంలో ట్రిపుల్ ఐటీకి భద్రతను పర్యవేక్షించడానికి మొదట సిఐని అప్పటి ప్రభుత్వం నియమించింది. దీంతో సమస్య మొదటికి రావటంతో మళ్లీ ప్రభుత్వం ప్రత్యేక డిఎస్పిని నియమించింది. ఇటీవల కాలంలో డిఎస్పీ పోస్టును కుదించి కేవలం సిఐని మాత్రమే పోలీస్ శాఖవారు నియమించారు. ట్రిపుల్ ఐటీకి ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులు ఉన్నప్పటికీ వీటిని పర్యవేక్షించడం పోలీస్ శాఖ పరిధిలోకి తెచ్చారు. అయితే కేవలం సీఐ మాత్రమే పర్యవేక్షించడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాకపోవటంతో ఆయా ఘటనలకు కారణంగా తెలుస్తుంది.  అంతేకాకుండా సిఐకి ప్రత్యేక సిబ్బందిని  నియమించలెదు. కేవలం ట్రిపుల్ ఐటీ భద్రత, సిబ్బందిని పర్యవేక్షించడం తప్ప , చేసేది ఏములేదు  అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రిపుల్ ఐటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ లు  తక్కువ సంఖ్యలో ఉండటము మరోకారణంగా చెప్పవచ్చు. ట్రిపుల్ ఐటీ భద్రత విషయంలో సెక్యూరిటీ గార్డులు ఆయా సందర్భాల్లో విద్యార్థులను మందలించినప్పటికీ, పలు సందర్భాల్లో విద్యార్థులే సెక్యూరిటీ గార్డులను బెదిరించిన ఉదంతాలు కూడా లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. భద్రతను కఠినంగా నిర్వర్తించాలంటే పోలీస్ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాల్సిన అవసరం ఉందని విద్యావంతులు, విద్యార్థి సంఘాలు అభిప్రాయ పడుతున్నారు. ఈ దిశగా నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.