ఆర్టీసీ కార్మికుల సమస్యలపై దృష్టి పెట్టండి

Focus on the issues of RTC workers–  పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డికి ఈయూ వినతి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై కాంగ్రెస్‌పార్టీ దృష్టి పెట్టాలని టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ విజ్ఞప్తి చేసింది. మంగళవారం యూనియన్‌ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి, డీ విద్యాసాగర్‌ పీసీసీ అధ్యక్షులు ఏ రేవంత్‌రెడ్డి నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. నాలుగు పేజీల వినతిపత్రంలో ఆర్టీసీ కార్మికులకు రావల్సిన ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వంలో విలీనం అయ్యాక పరిష్కరించాల్సిన అంశాలు, రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు, పెరిగిన అద్దె బస్సులు, కారుణ్య నియామకాలు, స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్‌ఎస్‌) చేసిన ఉద్యోగుల సమస్యలు వంటి అంశాలను ప్రస్తావించారు. ఆయా సమస్యల్ని కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరారు. ఆ లేఖను మ్యానిఫెస్టో కమిటీకి పంపుతామని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి చెప్పారు.