– మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ఏర్పడి పదేండ్లు పూర్తయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని మాజీ మంత్రి వి.శ్రీనివాసగౌడ్ తెలిపారు. ముఖ్యంగా తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని అంశాలు జఠిలంగా ఉన్నాయని అన్నారు. వాటి పరిష్కారంపై దృష్టి సారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తొమ్మిదో షెడ్యూల్‌లోని 30 సంస్థలకు సంబంధించిన సమస్యలు, పదో షెడ్యూల్‌లోని 102 సంస్థల అంశాలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని చెప్పారు. తమ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం కాదనీ, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.