– మండలంలోని ఆటో డ్రైవర్లు, యజమానులతో సమావేశం
నవతెలంగాణ – తాడ్వాయి
రోడ్డుపై ఆటోలు నడిపేటప్పుడు
రహదారి భద్రతా నియమాలను
ఆటో డ్రైవర్లు, యజమానులు పాటించాలని స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి సూచించారు. మండల కేంద్రంలో 107 మంది ఆటో డ్రైవర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ ఆటోలకు ముందు, వెనక భాగాన తాడ్వాయి పోలీస్ స్టేషన్ స్టిక్కర్లను అంటించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సూచించారు. దేశంలో 1నిమిషానికి రోడ్డు ప్రమాదం, మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లకు అందరికీ యూనిఫామ్ తప్పకుండా ఉండాలని, అలాగే డ్రైవర్ లైసెన్స్ తప్పనిసరి ఉండాలన్నారు. ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోవాలని సూచించారు. ఎక్కువమంది ప్రయాణికులతో ప్రయాణం చేయరాదన్నారు. రోడ్డు బాగా లేని స్థలాల్లో నెమ్మదిగా వెళ్లాలని తెలిపారు. ప్రయాణికుల రక్షణ మొదటి ప్రధానిగా ఉండాలన్నారు. సమావేశానికి క్రమశిక్షణతో కొత్తపేట శ్రీరాములు, పుల్లూరు లక్ష్మణ్ లు యూనిఫామ్ తో హాజరైనందుకు స్థానిక ఎస్సై గోడ గడియారాలు గిఫ్ట్ గా అందించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుల్ పూజా రమేష్, సివిల్, సిఆర్పిఎఫ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.