– అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్
నవతెలంగాణ-కొడంగల్
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల నియమాలకు అనుకూలంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ కోరారు. ఎన్నికల షె డ్యూల్ వెలువడిన నేపథ్యంలో బుధవారం కొడంగల్ మం డల తహసీల్దార్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఆయన మా ట్లాడుతూ 18 ఏండ్లు నిండిన వారు అక్టోబర్ 31 వరకు ఆన్ లైన్లో లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంద న్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, షెడ్యూల్ను అనుసరించి 3న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుం దని, నవంబర్ మూడవ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతాయని, డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వ హిస్తామన్నారు. ప్రచురించిన తుది ఓటరు జాబితా ప్రకా రం కొడంగల్ నియోజకవర్గంలో ముసాయిదా ఓటర్లు మొత్తం 2,30,251కు పురుషులు 1,09,162, స్త్రీలు 1,10,239, ఇతరులు 15, రెండవ ఎస్ ఎస్ ఆర్ లు పారం.6 ద్వారా కొత్త ఓటర్లు 10,835 అందులో పురుషు లు 4,979, స్త్రీలు 5,860 కొత్త ఓటర్లు నమోదు చేసుకు న్నారన్నారు. మసీదులు, చర్చిలు, దేవాలయలా ప్రాం గణంలో ఎటువంటి ప్రచారమూ నిర్వహించకూడదన్నా రు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడగకూడదని తెలి పారు. రాజకీయ పార్టీలు ఓటర్లను మభ్య పెట్టేందుకు విలువైన వస్తువులు ఇవ్వడం, ఓటర్లను బెదిరించడం, పోలింగ్ స్టేషన్కు వంద మీటర్ల లోపు ప్రచారం నిర్వహించకూడదన్నారు. పోలింగ్ జరిగే 48 గంటల ముందు వరకు ఎటువంటి పబ్లిక్ మీటింగ్ నిర్వహించబ డదని తెలిపారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇతర పార్టీ ల సమావేశాలకు ఆటకం కలిగించకూడదన్నారు. ఒకే ప్ర దేశంలో ఇరు పార్టీలు ర్యాలీలు, పబ్లిక్ సమావేశాలు నిర్వ హించకూడదని తెలిపారు. ఎన్నికల ఫిర్యాదులు, చే యాలనుకుంటే 1950 టోల్ ఫ్రీ నెంబర్, సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వచ్చ న్నారు. నామినేషన్ ప్రక్రియలను సులభతరం చేసేలా సి విజిల్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. రాజకీయ పార్టీలకు చెందినవారు వారి బూతు స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. ప్రచారాలను ఎప్పటి కప్పుడు కమిటీల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. పొలిటికల్ పార్టీలకు సంబంధించిన పోస్టర్ నుండి పాంప్లెంట్ వర కు ప్రింటింగ్ చేసే ప్రతి దానిపై ప్రెస్ పేరు ఫోన్ వివరా లను తప్పక అచ్చు వేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల పై వాల్ రైటింగ్, పోస్టర్లు, హౌర్డింగులు, బ్యానర్లు 24 గంటల లోపు, పబ్లిక్ స్థలాలలో ఉన్న వాటికి 48 గంట లలో ప్రయివేటులో ఉన్న వాటిని 72 గంటల లోపు తొల గించాలని తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలో ప్లేయింగ్ స్కాడ్స్ 5 బందాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. కస్తూరిపల్లి, చంద్రకల్, దేవరపసలాబాద్, రావుల పల్లి, సంపల్లి, దుద్యాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపా రు. 50 వేలకు పైన డబ్బులు ఉంటే వాటికి సరైన రసీదులు లేకుంటే సీజ్ చేస్తామన్నారు. రాజకీయ పార్టీల నాయకు ల స్టార్ క్యాంపినియర్లకు లక్ష రూపాయల వరకు అవ కాశం ఉంటుందన్నారు. అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుండి కొత్త బ్యాంకు అకౌంటు వాడాలన్నారు. ఎంసిసి ద్వారా మీడియా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ప్రకట నలు చేయాల్సి ఉంటుందన్నారు. వద్ధులకు 12 డి ఫా రం ద్వారా ఇంటి దగ్గర నుండి ఓటింగ్ చేసే అవకాశం కల్పించినట్టు తెలిపారు. రాజకీయ పార్టీలు సమావేశాలు నిర్వహించాలంటే ఎన్నికల అధికారితో 5 రోజుల ముందే పర్మిషన్ తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో అభ్యర్థు లపై వ్యక్తిగత విమర్శలు చేయరాదన్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ విజరు కుమార్, ఎంపీడీవో పాం డు, ఎస్సై భరత్ రెడ్డి, దౌల్తాబాద్ ఎస్సై రమేష్ కుమార్, బొంరాస్ పేట్ ఎస్సై శంకర్, డిప్యూటీ తహసిల్దార్ సురేష్, ఆర్ ఐ శతి, బీఆర్ఎస్ నాయకులు రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు కష్ణంరాజు, ఎంఐఎం నాయకులు ఎస్బి గుల్షన్, సిపిఐ నాయకులు శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.