ఈ సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయిపోండి!

హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అందరూ అనుకుంటారు. దానికోసం తెగ కష్టపడిపోవాలేమో అనుకుంటారు. కానీ రెగ్యూలర్‌గా మనం కొన్ని ఫాలో అవ్వడం వల్ల హెల్తీగా ఉండడమే కాకుండా.. బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఆ సింపుల్‌ టిప్స్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రెగ్యూలర్‌ వ్యాయామం..
వ్యాయామం చేయడానికి సమయం లేదా అయితే చిన్న, తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. వీటివల్ల కేవలం బరువు తగ్గడమే కాదు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. వ్యాయామం మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. యాక్టివ్‌గా ఉండడంలో మనకు హెల్ప్‌ చేస్తుంది. ఎముకలను, కండరాలను ధడంగా చేస్తుంది.
హైడ్రేటెడ్‌గా ఉండండి..
సమ్మర్‌ అయినా కాకున్నా.. నిరంతరం హైడ్రైటేడ్‌గా ఉంటే మంచిది. ఇది కేవలం దాహం తీర్చడమే కాదు.. శరీరం, మెదడును కూడా ఉత్తేజపరుస్తుంది. మీరు నిత్యం ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడం, కీళ్లనొప్పులు దూరం చేయడం, శరీరాన్ని డిటాక్స్‌ చేయడం వంటి ఫలితాలు ఇస్తుంది.
బయటకు వెళ్లండి
వర్క్‌ ఫ్రమ్‌ హౌమ్‌ చేసేవారిలో చాలామంది రూమ్‌లకే పరిమితమైపోతున్నారు. అలాంటివారు కూరగాయల కోసమో.. పెట్స్‌ కోసమో.. లేదంటే ఈవెనింగ్‌ వాక్‌ కోసమో బయటకు వెళ్తూ ఉండాలి. ఇది మిమ్మల్ని మానసికంగా ఉత్తేజ పరుస్తుంది. ఉదయానే విటమిన్‌ డి కోసం ఎండలో కూర్చొన్నా మంచిదే. విటమిన్‌ డి బరువు తగ్గడంలో హెల్ప్‌ చేస్తుంది.
పోషకాలతో నిండిన ఆహారం
హెల్తీగా ఉండడంలో మొదలుకుని.. బరువును అదుపులో ఉంచడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమతుల్యమైన ఆహారం మీకు ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా.. బరువును తగ్గించడంలో హెల్ప్‌ చేస్తుంది. పండ్లు, కూరగాయలు, బీన్స్‌, నట్స్‌, ప్రోటీన్స్‌ కలిగిన ఫుడ్స్‌ మీ డైట్‌లో చేర్చుకుంటే మంచిది. విటమిన్స్‌, మినరల్స్‌, పీచుతో కూడిన ఫుడ్స్‌ మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాయి.
ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌ వద్దు
పోషకాలు కలిగిన ఫుడ్స్‌ తీసుకోవడం మంచిదే కానీ.. ప్రాసెస్‌ చేసిన వాటితో పోషకాలు పొందాలి అనుకోకూడదు. ప్రాసెస్‌ చేసిన ఫుడ్‌లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉప్పు, చక్కెర మోతాదుకు మించి ఉంటాయి. తినేందుకు టేస్టీగానే ఉన్నా ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాయి.
స్క్రీన్‌ సమయం
పనికోసం ల్యాప్‌ టాప్‌, రిఫ్రెష్‌మెంట్‌ కోసం ఫోన్‌. ఇలా చాలామందిలో స్క్రీన్‌ టైమ్‌ పెరిగిపోతుంది. ఇది కేవలం కంటికే కాదు మీ మొత్తం శరీరానికి చెడు చేస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులు, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. రోజంతా కూర్చోని చేయాల్సిన పని ఉంటే కాసేపు దానికి విరామం తీసుకోండి. ఇది మీరు హెల్తీగా ఉండడంలో హెల్ప్‌ చేస్తుంది.
నిద్రలేకుంటే ఏమి చేసినా వేస్టే
మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఇది మొత్తం ఆరోగ్యాన్ని, బరువును, మానసిక ప్రయోజనాలను అందిస్తుంది. నిద్రపోయేప్పుడు శరీరం అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేస్తుంది. శారీరక విధులు చేయడం, కండర కణజాలాన్ని సరిచేయడం, మెదడును ప్రాసెస్‌ చేయడం, శక్తిని అందించడం వంటి పనులు చేస్తుంది. నిద్రలేకుంటే ఇవన్నీ శరీరానికి అందక.. హెల్త్‌ కరాబ్‌ అవుతుంది. దానివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ. గుండె జబ్బులు, మధుమేహం సమస్యలకు దారితీస్తుంది. అందుకే మంచి నిద్రకు ప్రాధాన్యం ఇవ్వండి.
మల్టీవిటమిన్స్‌ తీసుకోండి
కొన్ని విటమిన్స్‌ వివిధ ఫుడ్స్‌ ద్వారా తీసుకోలేకపోతుంటే.. వాటిని మెడిసన్‌ రూపంలో తీసుకోండి. మల్టీ విటమిన్స్‌ శరీరానికి అవసరమైన విటమిన్స్‌, పోషకాలను అందిస్తాయి. అయితే వీటిని వినియోగించే ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి.