ఈ చిట్కాలు పాటిస్తే..

When putting clothes in the washing machineవాషింగ్‌ మెషిన్‌లో బట్టలు వేసినప్పుడు మురికి సరిగ్గా వదలడంలేదని చాలా మంది చెబుతుంటారు. చేతుల దగ్గర, కాలర్‌ దగ్గర మురికి అలానే ఉండిపోతుందని, ఎంత డిటర్జెంట్‌ వాడినా ఫలితం ఉండడం లేదని చెబుతుంటారు. అయితే ఈ టిప్స్‌ పాటించడం వల్ల నల్లటి మరకలు కూడా మెషిన్‌లోనే ఉతికేయొచ్చు. తెలుసుకుందాం..
నిండుగా బట్టలు వేయకూడదు
బట్టలు సరిగ్గా ఉతకాలంటే వాషింగ్‌ మెషిన్‌ నిండుగా బట్టలు వేయకూడదు. ఇలా వేయడం వల్ల బట్టలు శుభ్రం కావు. మురికి కూడా సరిగ్గా వదలదు. బట్టలు సరిగ్గా ఉతకాలంటే మిషన్‌లో ఎప్పుడూ కొంత స్థలాన్ని వదిలేయాలి. 10 కేజీల సామర్థ్యం ఉన్న మెషిన్‌ ఉన్నప్పటికీ కేవలం 7 నుంచి 8 కేజీల వరకు మాత్రమే అందులో వేయాలి. అలాగే బట్టలు సగం ఉతికిన తరువాత మళ్లీ కొద్దిగా లిక్విడ్‌ లేదా పౌడర్‌ వేయాలి. ఈ విధంగా బట్టలు సులభంగా శుభ్రం చేయవచ్చు.
చొక్కా కాలర్‌ ఎలా శుభ్రం చేయాలి?
షర్ట్స్‌ మిషిన్‌లో వేస్తే.. వాటిని తిప్పి వేయాలి. ముందుగా షర్ట్స్‌ను ఒక అరగంట బకెట్‌లో సర్ఫ్‌ లేదా లిక్విడ్‌ వేసి నానిన తర్వాత మెషిన్‌లో వేస్తే మురికి బాగా పోతుంది.
మెషిన్‌ టబ్‌, ఫిల్టర్‌ శుభ్రంగా ఉంచుకోవాలి
వాషింగ్‌ మెషీన్‌ టబ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. యంత్రం పూర్తిగా ఆరిపోయిన తర్వాత, తడి గుడ్డతో తుడవాలి. 15 రోజుల కొకసారి ఫిల్టర్‌ని తీసి శుభ్రంచేస్తూ వుండాలి.