ట్రాఫిక్ నిబంధనలను పాటించి విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్ అన్నారు. పట్టణంలోని పెర్కిట్ చౌరస్తా వద్ద మంగళవారం ప్రజలకు ట్రాఫిక్ నీయమ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి. లేనిచో జరిమానలు తప్పవు. రోడ్డు ప్రమాదంలో విలువైన ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం పై ఆధారపడ్డ భార్య, పిల్లల జీవితాలు ప్రశ్నార్థకం అవుతాయని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దు. . నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.