“ఐలాపూర్” వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం 

Food Donation Program at "Ailapur" Vinayaka Mandapamనవతెలంగాణ – తాడ్వాయి 
మండలంలోని కాటాపూర్ లోనీ ఐలాపూర్ వినాయక మండపం వద్ద సోమవారం ప్రజలు, విగ్రహాల నిర్వాహకులు విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు నాయకులు, ప్రజా సంఘాల నేతలు మండపాలను సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం దాత అగుల్ల నరేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు తండలుగా కదిలి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనాలు ఆరగించారు. ఈ కార్యక్రమంలో ఐలాపూర్ విఘ్నేశ్వర కమిటీ అధ్యక్షులు పోలెబోయిన సంతోష్, సభ్యులు, కమిటీ పెద్దలు మైపతి గోపాల్, ముంజ ప్రదీప్, కూచన సురేష్, పోలెబోయిన రమేష్, ఎట్టి నరేష్, తమ్మల సమ్మయ్య గౌడ్, ముత్తినేని లక్ష్మయ్య, గడ్డం సత్యం, గడ్డం మొగిలి గౌడ్, పాలకుర్తి బాబు తదితరులు పాల్గొన్నారు.