రమనేశ్వరంలో అన్నదాన కార్యక్రమం..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో శివశక్తి శిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం రమనేశ్వరంలో  శ్రీ రమణానంద మహర్షి 29వ ఆత్మ సాక్షాత్కార మహోత్సవంలో భాగంగా సుమా 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా రామేశ్వరంలో వేలమంది భక్తులతో ధ్యానం యోగ ప్రవచనాలు మహర్షిచే నిర్వహించారు. 2000 మంది భక్తులు 2000 శివ లింగాలకు ద్వి సహస్ర ఘట్టాభిషేకం, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సర్వ శ్రేష్ట యజ్ఞ నిర్వాహకులైన భక్తులకు మహర్షి దివ్యదర్శనం, దివ్య ఆశీస్సులు అందించి దివ్య అనుగ్రహం ప్రసాదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.